News
10 మంది మత్స్యకారులు గల్లంతు
వార్దా తుపాన్ గురించి ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా లాభం లేకుండా పోయింది. సముద్ర తీరంలో వేటకు వెళ్లిన 10 మంది మత్స్యకారులు గల్లంతు అయినట్లుగా సమాచారం. మత్స్యాకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు చేస్తునే ఉన్నారు. దీనిపై అధికారికంగా పూర్తి సమాచారం అందవలసి ఉంది. కాగా చెన్నైలో 176 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగాఉన్నాయి. విశాఖ నుంచి రెండు నౌకలు ఐఎన్ఎస్ శివానిక్, ఐఎన్ఎస్ కడ్మెట్ చెన్నై బయల్దేరాయి. నౌకల్లో రబ్బరు బోట్లు, గజ ఈతగాళ్లు ఉన్నారు. చెన్నైలో సోమవారం ఉదయం నుంచి 8 సెం.మీటర్ల వర్ష పాతం నమోదు అయింది. మరో 7 సెం.మీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరువళ్లూరు ప్రాంతంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. పౌర్ణమి కారణంగా అలల ఉదృతి అధికంగా ఉంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








